News

ఎమ్మెల్యే టిఫిన్‌లో పురుగులు


విజయవాడ నగరంలోని కొన్ని హోటళ్లు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఆహార పదార్ధాల్లో నాణ్యత పాటించకుండా పురుగులు, నాసిరకం వంటకాలతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే చేస్తున్న టిఫిన్ లోనే పురుగులు ఉండడాన్ని బట్టి చూస్తుంటే ఇక ఆ హోటల్ లో నాణ్యతా ప్రమాణాలను ఏవిధంగా ఉన్నాయో ఇట్టే ఊహించుకోవచ్చు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మంగళవారం ఉదయం నగరంలోని హోటల్‌ గ్రాండ్‌ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా దాంట్లో పురుగులు ఉండటాన్ని గమనించాడు. దీంతో ఆయన విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే రామారావు ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు.